: సచిన్ కంటే ముందు ధ్యాన్ చంద్ కే భారతరత్న ఇవ్వాలి: మిల్కాసింగ్
క్రికెట్ మాంత్రికుడు సచిన్ టెండూల్కర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించడంపై వివాదం ఇంకా వీడలేదు. సచిన్ కు పురస్కారం ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించకపోయినా, ముందుగా అతనికే అవార్డు ప్రకటించడంపై మండిపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత అథ్లెట్ దిగ్గజం, ఫ్లైయింగ్ సిఖ్ మిల్కాసింగ్ కూడా చేరాడు. సచిన్ కు అవార్డు ఇవ్వడం తప్పుకాదని, అయితే ముందుగా ధ్యాన్ చంద్ ను ఆ అవార్డుతో సత్కరించి ఉంటే తాను సంతోషించి ఉండేవాడినని అన్నాడు. భారతరత్న జాబితాలో క్రీడాకారులను చేర్చడాన్ని తాను అభినందిస్తున్నానన్నాడు.