: విభజనపై హైకోర్టులో మరో పిటిషన్
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. లాయర్ సి.రామచంద్రరాజు, వి. సుబ్బారావు ఈ పిటిషన్ వేశారు. విభజనపై స్పష్టమైన విధానం లేదని, దానిపై జాతీయ స్థాయి చట్టం తేవాలని అందులో కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై పార్లమెంటులో చర్చించకుండా, విభజన ప్రక్రియను చేపట్టడం తప్పని పేర్కొన్నారు. మంగళవారం నాడు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.