: తెలంగాణకు మేం మద్దతివ్వలేదు: శరద్ యాదవ్
తెలంగాణకు తాము మద్దతు ఇవ్వలేదని జేడీయూ అధినేత శరద్ యాదవ్ తెలిపారు. సమైక్యానికి మద్దతుగా జాతీయ పార్టీల నేతల మద్దతును కూడగట్టే ప్రక్రియలో భాగంగా జేడీయూ అధినేత శరద్ యాదవ్ ను ఈ రోజు జగన్ కలిశారు. ఈ సందర్భంగా అప్రజాస్వామికంగా జరుగుతున్న విభజనను అడ్డుకోవాలని శరద్ యాదవ్ కు జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శరద్ యాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీని విశ్వాసంలోకి తీసుకోకుండా విభజన ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా విభజన సరికాదన్నారు. అసెంబ్లీ తీర్మానాలతోనే రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. తెలంగాణకు మద్దతిస్తామా? లేదా? అనేది పార్లమెంటులోనే చెబుతామని శరద్ యాదవ్ తెలిపారు.