: ధనుష్ క్షిపణీ పరీక్ష విజయవంతం
అణు బాలిస్టిక్ మిసైల్ ధనుష్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో నౌక నుంచి దీన్ని ప్రయోగించారు. ఇది విజయవంతం అయినట్లు చాందీపూర్ పరీక్షా కేంద్రం డైరెక్టర్ ఎం.వి.కె.వి ప్రసాద్ తెలిపారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధనుష్ ఛేదించగలదు. దేశీయంగా డీఆర్ డీవో రూపొందించిన ఐదు మిసైళ్లలో ఇది కూడా ఒకటి. ఈ మిసైల్ ను ఇప్పటికే సాయుధదళాల్లోకి ప్రవేశపెట్టారు. సంప్రదాయ మందుగుండుతోపాటు 500 నుంచి 1,000కేజీల అణు ఇంధనాన్ని మోసుకుని పోగలదు. నేలపై, సముద్రంపై లక్ష్యాలను పూర్తి చేయగలదు.