: మావోయిస్ట్ చీఫ్ ప్రచండ గెలుపు
నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మావోయిస్టు చీఫ్ ప్రచండ గెలుపొందారు. శిరాహ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన 900 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి లీలా శ్రేష్ఠపై విజయం సాధించారు. అయితే ఖాట్మండూ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేసిన ఆయన అక్కడ ఓటమిపాలయ్యారు. 240 స్థానాలకు గానూ ఇప్పటిదాకా 205 నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించగా... 87 స్థానాలను గెలుపొందిన నేపాలీ కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిచింది. 79 సీట్లతో సీపీఎన్-యూఎంఎల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీ కేవలం 24 స్థానాలను కైవసం చేసుకోగా, మిగిలిన 15 సీట్లలో ఇతరులు గెలుపొందారు.