: బ్యాంకు ఖాతాల్లో చలనం లేని 3,652 కోట్లు
బ్యాంకు ఖాతాలున్న ప్రతీ ఒక్కరూ వాటిని ఉపయోగించాలని లేదు. కొంత మంది ఏళ్ల తరబడి అలా వాడకుండా వదిలేస్తుంటారు. అలాంటి ఖాతాలలో ఐదొందలో.. వెయ్యో ఎంతో కొంత కనీస బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. ఇలా దేశీయ బ్యాంకుల్లో 1.33కోట్ల ఖాతాలు వాడనివి ఉన్నాయి. వాటిలో రూ. 3,652కోట్లు (గతేడాది డిసెంబర్ నాటికి) మురిగిపోతున్నాయి. ఈ వివరాలను భారతీయ రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐ వద్ద రూ.714కోట్లు ఇలా వాడని ఖాతాల్లో పడి ఉన్నాయి. రూ. 525 కోట్లతో కెనరా బ్యాంకు రెండో స్థానంలో ఉంది. వరుసగా రెండేళ్లపాటు ఖాతాలో ఒక్క లావాదేవీ జరగకపోతే దాన్ని వాడుకలో లేని ఖాతాగా పరిగణిస్తారు.