: రాగల 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు


మచిలీపట్నం వద్ద నిన్న తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన హెలెన్ ఈ రోజు మరింత బలహీనపడింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా బాపట్లకు సమీపంలో వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ-నైరుతి దిశగా పయనిస్తోంది. వాయుగుండం మరో 6 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News