: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవినుంచి రేణుకా చౌదరి తొలగింపు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి (ఏఐసీసీ) పదవినుంచి సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని ఆ పార్టీ అధిష్ఠానం తొలగించింది. పార్టీ ఆంక్షల మేరకు పని చేయడం లేదని బాధ్యతల నుంచి రేణుకను తప్పించినట్లు సమాచారం. కాగా, పార్టీ తరపున టీవీ చానళ్లలో చర్చలకు వెళ్లొద్దని కూడా కాంగ్రెస్ ఆమెను ఆదేశించింది.