: ఈసీకి అందిన ఏఏపీ స్టింగ్ ఆపరేషన్ ఫుటేజ్
ఆమ్ ఆద్మీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన స్టింగ్ ఆపరేపన్ ఫుటేజ్ ని... మీడియా సర్కార్ జర్నలిస్ట్ అనురంజన్ ఝా ఎలక్షన్ కమిషన్ కు అందజేశారు. సాయంత్రం 5 గంటలకు తమకు ఒరిజినల్ ఫుటేజ్ ని అందజేయాల్సిందిగా... అనురంజన్ ఝాను ఈసీ కోరింది. ఇదే సమయంలో ఏఏపీ కూడా ఈ రోజు 3 గంటల్లోగా తమకు ఒరిజినల్ ఫుటేజ్ ను అందజేయాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఝాను హెచ్చరించింది. దీనికి స్పందించిన ఝా... తనను హెచ్చరించడానికి ఏఏపీ ఎవరని, తాను ఒరిజినల్ ఫుటేజ్ ని ఈసీకి మాత్రమే అప్పగిస్తానని చెప్పారు. అనంతరం ఈసీని కలిసి ఫుటేజ్ ను అప్పగించారు.