: అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ లేఖ రాసిన మాట నిజమే: సీఎంఓ
అసెంబ్లీని ప్రొరోగ్ చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన మాట వాస్తవమేనని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయకుంటే ఆర్డినెన్స్ ను జారీ చేయలేమని చెప్పింది. కొన్ని అంశాలకు సంబంధించిన ఆర్డినెన్స్ లు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నాయని, ప్రొరోగ్ చేయడమంటే పరిపాలనపరమైన అంశమే తప్ప మరొకటి కాదని పేర్కొంది. అయితే, ప్రొరోగ్ పై మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.