: వాడు బ్రతకడానికి అనర్హుడు.. మరణించే వరకూ ఉరితీయండి: ఢిల్లీ కోర్టు


మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో భరత్ కుమార్(23) అనే వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఉరి శిక్ష వేసింది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరమని సంఘంలో జీవించడానికి అర్హులు కారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దోషి మరణించే వరకు ఉరి తీయాలని అదనపు సెషన్స్ జడ్జి వీరేంద్ర భట్ ఆదేశించారు. 2010లో భరత్ తన ఇంటి వద్ద నివసిస్తున్న బాలికకు స్నాక్స్ ఇస్తానని ఆశ చూపి ఢిల్లీలోని పాలెం అనే గ్రామసమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ క్రమంలో బాలిక శరీరం, ముఖంపై తీవ్ర గాయాలు చేశాడు. విషయం వెలుగులోకి రాకూడదని బాలికను అక్కడే చంపేసి ఏమీ ఎరగనట్టు వెళ్లిపోయాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు భరత్ నేరం చేసినట్టు నిరూపించారు. దీంతో ఈ కామాంధుడికి ఉరి శిక్ష పడింది.

  • Loading...

More Telugu News