: చర్చికి హాజరుకావద్దు.. సూర్యనెల్లి బాధితురాలి కుటుంబాన్ని ఆదేశించిన కేరళ చర్చి
సూర్యనెల్లి అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఇక నుంచి చర్చికి దూరంగా ఉండాలంటూ కేరళ చర్చి కోరింది. ఘటనకు సంబంధించి విషయాలన్నీ సర్దుకునేంతవరకు చర్చికి హాజరుకావద్దని ఆదేశించింది. ఈ కేసులో బాధితురాలు కొన్ని రోజుల కిందట కేరళ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో.. అత్యాచార ఘటనలో రాజ్యసభ ఛైర్మన్ పీజే కురియన్ తో పాటు క్రైస్తవ సమాజం ప్రముఖ సభ్యుడిని కూడా నిందితుడిగా చేర్చాలంటూ పేర్కొంది.
అయితే, న్యాయస్థానం ఈ పిటిషన్ ను గతవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో విషయం ఓ కొలిక్కి వచ్చేవరకు చర్చికు హాజరుకావద్దంటూ బాధితురాలి తండ్రిని చర్చి ఫాదర్ ఆదేశించారు.