: కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల బాహాబాహీ
విజయవాడ మహంతిపురంలో జరిగిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. రచ్చబండను సీపీఎం కార్యకర్తలు అడ్డుకోవడంతో.. కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు చెందిన వారిని అరెస్టు చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.