: ఆగిన క్యూరియాసిటీ


అంగారకుడిపై అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా ఆగిందట. అంగారకుడిపై పలు పరిశోధనల కోసం నాసా క్యూరియాసిటీ రోవర్‌ను పంపింది. దీనిద్వారా అక్కడి జీవ ఉనికి, వాతావరణం తదితర వివరాలను సేకరించే విషయంలో ఈ రోవర్‌ చాలా ముఖ్యమైన సమాచారాన్ని పంపుతోంది. అయితే ఈ రోవర్‌లో ఎలక్ట్రికల్‌ వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా దీని కార్యకలాపాలను శాస్త్రవేత్తలు తాత్కాలికంగా నిలిపివేశారు.

2012 ఆగస్టులో అంగారకుడిపై జీవం తదితర విషయాలను గురించి ఆనవాళ్లను సేకరించేందుకు నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్‌ ఇప్పటి వరకూ అక్కడి మట్టిని, శిలలను పరీక్షిస్తూ చాలా విలువైన సమాచారాన్ని పంపిస్తోంది. అయితే ఈ రోవర్‌లో నవంబరు 17న రోవర్‌లోని అన్ని భాగాలకు విద్యుత్తును సరఫరా చేసే 32 వోల్టుల సామర్ధ్యంగల పవర్‌బస్‌కు, చాసిస్‌ (చట్రం)కు మధ్య వోల్టేజీలో తేడా ఏర్పడింది. దీనికి కారణాలను తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ప్రస్తుతం రోవర్‌ కంప్యూటర్ల సహా పూర్తి సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలను నిర్వహించగలుగుతోందని, అయితే ముందు జాగ్రత్త చర్యగానే రోవర్‌ వోల్టేజీలో మార్పులపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News