: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై స్టింగ్ ఆపరేషన్


ఆరోపణలు ప్రత్యారోపణలతో ఐదు రాష్ట్రాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఒక్కొక్కర్ని ఒక్కోలా చిత్తు చేస్తున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై అనురంజన్ జా అనే వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేశాడు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం ప్రలోభాలకు గురిచేస్తోందని, డబ్బులు పంచుతోందని ఆరోపిస్తూ 40 నిమిషాల నిడివి కలిగిన వీడియో టేప్ లను విడుదల చేశాడు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు లేకపోవడంతో అనురంజన్ ఆరోపణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News