: గేల్ అవుట్.. పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయిన విండీస్


మ్యాచ్ లోని రెండో బంతికే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఎన్నో అంచనాల మధ్య క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్ రెండో బంతికే రనౌట్ గా వెనుదిరిగాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న గేల్ రెండో బంతిని మిడ్ వికెట్ దిశగా మరల్చాలనుకున్నాడు. సరిగా కనెక్ట్ కాకపోవడంతో రన్ తీసేందుకు ప్రయత్నించిన గేల్ ను, డైరెక్ట్ త్రోతో భువనేశ్వర్ రన్ అవుట్ చేశాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. శామ్యూల్స్ కి ఛార్లెస్ కి జతకలిశాడు.

  • Loading...

More Telugu News