: మమత, ములాయంను కలసి జగన్ ఏం సాధిస్తారు? : యనమల


జగన్ చేపట్టిన దేశ పర్యటన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీలు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని ఎప్పుడో చెప్పాయని... అలాంటప్పుడు మమతను, ములాయంను కలిసి జగన్ సాధించేది ఏంటని ప్రశ్నించారు. విభజనవాది అయిన మాయావతిని జగన్ ఎందుకు కలవడం లేదని అన్నారు. సోనియాతో శాశ్వత ఒప్పందం, తన లూటీకి మిగిలిన పార్టీల ఆమోదమే జగన్ ఎజెండా అని విమర్శించారు. జగన్ విషయంలో రాజకీయ పార్టీలు, కోర్టులు అప్రమత్తంగా ఉండాలని యనమల హెచ్చరించారు.

  • Loading...

More Telugu News