: ఆడలేననుకున్న క్షణమే రిటైర్ అవుతా: గంభీర్
పాపం గంభీర్ పరిస్థితి.. ఒక్క అవకాశం రాకపోతుందా? అన్నట్లుగా ఉంది. తిరిగి ఎలా అయినా భారత జట్టులో స్థానం దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా మంచిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒకనాటి ఓపెనర్ అయినా గంభీర్ ఇప్పుడు అవకాశం దొరికితే అదే పదివేలు అన్నట్లుగా ఉన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో అవకాశం దక్కుతుందనే ఆశతో గంభీర్ ఉన్నాడు.
'నేను కోరుకున్నంత వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడతాను. ఇక ఆడలేననుకున్న క్షణమే రిటైర్ అవుతా' అని చెప్పాడు. ఆటగాడిగా భారత జట్టు విజయం కోసం ఉత్తమంగా కృషి చేశానన్నాడు. 'మళ్లీ జట్టులోకి తిరిగి రావాలన్న దృష్టితో ఆడను. ఎందుకంటే నేను అనుభవిస్తూ ఆడతాను. జట్టులోకి తిరిగి రావడం అన్నది నా చేతిలో లేదు' అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.