: ఈ రోజైనా ఆనంద్ గెలిచేనా.. ఛాంపియన్ షిప్ లో నేడు తొమ్మిదో రౌండ్
డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. చెన్నైలో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో ఇప్పటి వరకు ఎనిమిది గేమ్ లు ముగిశాయి. ప్రత్యర్థి కార్ల్ సన్ చేతిలో 5,6 గేముల్లో ఓడిన ఆనంద్ 3-5 పాయింట్ల తేడాతో వెనుకబడి ఉన్నాడు. ఈ రోజు వీరిద్దరి మధ్య జరగనున్న తొమ్మిదో మ్యాచ్ లో ఆనంద్ తెల్ల పావులతో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ ను ఆనంద్ కోల్పోతే, ఛాంపియన్ షిప్ పై ఆశలు వదులుకోక తప్పదు.