: భద్రాచలం వివాదానికి కేసీఆరే కారణం: ఎంపీ నామా
ప్రస్తుత భద్రాచలం వివాదానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆరే మూలకారణమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అయితే, పార్లమెంటులో భద్రాచలంతో కూడిన తెలంగాణ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పోలవరంతో తెలంగాణ గిరిజన ప్రజలను ముంచాలని చూస్తే.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ ను ముంచుతారని నామా హెచ్చరించారు.