: జూబ్లీహిల్స్ లో 'ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం' ప్రారంభం
హైదరాబాదులోని జూబ్లీహిల్స్ వెంకటగిరిలో ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర ఉద్యోగుల సమాఖ్య నూతన భవనాన్ని దర్శకుడు దాసరి నారాయణరావు ప్రారంభించారు. ఈ భవనానికి 'ఎన్టీఆర్ సినీ కార్మిక భవనం'గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, చెన్నై నుంచి హైదరాబాదుకు తరలివచ్చిన చిత్ర పరిశ్రమలోని వివిధ సంఘాలు కొన్నేళ్లుగా అద్దె భవనాల్లోనే ఉంటున్నాయన్నారు. ఇప్పుడు కొత్త భవనం ఏర్పాటు కావడంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత రామానాయడు, మరో నిర్మాత దిల్ రాజు, పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.