: ఆ ఫొటోలు నావే.. బికినీలో కన్పిస్తే తప్పేంటి : కత్రినా కైఫ్


బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కత్రినా కైఫ్ స్విమ్ సూట్ ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఫారిన్ బీచ్ లో సోయగాలు ఒలకబోసిన కత్రినాకైఫ్ ఫోటోలపై ఆమెను సంప్రదించిన మీడియాకు షాకిచ్చిందీ భామ. 'ఫొటోలు చూడండి ఎంత బాగున్నాయో' అంది. తానొక్కదానినే కాదని, బాలీవుడ్ లో చాలామంది తారలు బికినీల్లో కనిపించారని చెప్పింది. బికినీ ఫొటోల్లో కనిపిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్న వేసింది.

అయినా స్విమ్మింగ్ పూల్ లోకి జీన్స్ తో దిగుతామా? స్విమ్మింగ్ డ్రెస్సే వేసుకోవాలని కత్రినా సూచించింది. అవి మార్ఫింగ్ ఫొటోలు కావని, తన ఫొటోలేనని సెలవిచ్చింది. తమకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, విదేశీ బీచ్ లలో ఫ్యామిలీతో ఉన్నప్పుడు వాటిని తనకు తెలియకుండా చాటునుంచి తీశారని తెలిపింది. అయినా, వాటిగురించి సీరియస్ గా స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News