: 371-డి సవరణ జరగాల్సిందే: యనమల
ఆర్టికల్ 371-డి సవరణ కోసం అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్ర విభజన ప్రక్రియకు ముందైనా, తర్వాతైనా.. ఆర్టికల్ 371-డి సవరణ జరగాల్సిందేనని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పైన లేదా స్పీకర్ పైన అవిశ్వాసం నోటీస్ ఎవరైనా ఇవ్వొచ్చని అభిప్రాయ పడ్డారు. తనపై అవిశ్వాసం నోటీస్ వస్తే దానికి సంబంధించిన చర్చలో మాత్రమే స్పీకర్ పాల్గొనరని, విభజనపై చర్చను యథాతథంగా కొనసాగించవచ్చని యనమల అన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ మధ్య వివాదం కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు.