: ఫిట్ నెస్ లో తల్లిదండ్రులే బెస్టు
నేటి యువతరం కంటే వారి తల్లిదండ్రులే ఫిట్ గా ఉన్నారని ఓ అధ్యయనం తెలిపింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఓ పరిశోధనలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. యువతరం కంటే వారి తల్లిదండ్రులే ఫిట్ గా ఉన్నారని అన్నారు. ప్రతి పదేళ్లలో పిల్లల ఫిట్ నెస్ పడిపోతోందని ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనలో విద్యార్థులు ఎంత దూరం వరకు అలసట లేకుండా ప్రయాణించగలుగుతున్నారనే విషయాలను లెక్కించి తెలుసుకున్నట్టు నిపుణులు తెలిపారు.
బాలికలు, బాలురకు వేరువేరుగా నిర్వహించిన పరిశోధనల్లో వీరి ఫిట్ నెస్ దారుణంగా పడిపోతున్నట్టు వారు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిపై చేసిన పరిశోధనల ఫలితంగా ఈ విషయం వెల్లడైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి కారణాలుగా పలు విషయాలను వీరు వెల్లడించారు. ప్రధానంగా ఆహారం, అలవాట్లు ఫిట్ నెస్ తరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని కారణంగానే యవ్వనంలోకి ప్రవేశించకుండానే గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది.