: మోడీకి వీసా తిరస్కరణను కొనసాగించండి: యూఎస్ కాంగ్రెస్ తీర్మానం
బీజేపీ ప్రధాని ఎన్నికల అభ్యర్ధి నరేంద్ర మోడీ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఆ దేశ అధికార ప్రతినిధులు కొన్ని రోజుల కిందట పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడి పార్టీలు మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఈ మేరకు ఓ తీర్మానం చేసిన అమెరికా కాంగ్రెస్.. మత స్వేచ్ఛ ఉల్లంఘన కోణాలలో మోడీకి తమ దేశ వీసా తిరస్కరణను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. కాగా, అల్ప సంఖ్యాకంగా ఉన్న పలు మతాల వారి హక్కులు, స్వేచ్ఛను భారతదేశం కాపాడాలని తీర్మానంలో పేర్కొనగా.. ఈ విషయాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక విధానంలో చేర్చాలని కోరింది. తీర్మానాన్ని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన కీత్ ఎల్లిసన్, రిపబ్లికన్ పార్టీకి చెందిన జోయ్ పిట్స్, ఇంకా పలువురు చట్టసభ సభ్యులు కాంగ్రెస్ లో ప్రవేశపెట్టారు.