: రచ్చకెక్కిన బాలరాజు, గంటా
విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావు రచ్చకెక్కారు. తనను సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని, తన శాఖాపరమైన పనులను సీఎం విశేషాధికారాలతో అధికారులతో చేయించుకుంటున్నారని మంత్రి బాలరాజు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానమిస్తూ మంత్రి బాలరాజు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన గురించి రెండు రోజుల ముందే సమాచారం అందించామని అన్నారు. విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. విభజన అడ్డుకునేందుకు తాము రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు.