: జీవోఎం ముందు సమైక్య వాదాన్నే వినిపించాం: కావూరి
జీవోఎం ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులంతా సమైక్య వాదాన్నే వినిపించామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటులో తెలంగాణ బిల్లును పాస్ చేస్తే తామేమీ చేయలేమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధిష్ఠానంతోనే పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. బిల్లును ఓడించేందుకు ఇతర పార్టీల నేతలను కలిసే ఆలోచనేమీ లేదని కావూరి వెల్లడించారు.