: బోల్తాకొట్టిన కావేరీ ట్రావెల్స్ బస్సు.. మహిళ మృతి
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నా.. ప్రమాదాలకు బ్రేక్ పడడం లేదు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సింగరాయకొండ దాటిన తర్వాత అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా 10 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అధిక వేగంతో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.