: తెలంగాణ నేతలు రాయల తెలంగాణకు అనుకూలం: జేసీ
తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు రాయల తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ తాను మొదటి నుంచి రాయల తెలంగాణ అంటున్నానని గుర్తు చేశారు. రాయల తెలంగాణ ఏర్పాటు కాకుంటే మరో ఐదేళ్లలో రాయలసీమ కొత్త రాష్ట్రంగా ఏర్పడుతుందని అన్నారు. సీమాంధ్ర కొత్త రాష్ట్రంలో కర్నూలు రాజధానిగా చేసేందుకు తాము పోరాడుతామని అన్నారు. తెలంగాణనేతలు రాయల తెలంగాణకు అభ్యంతరం చెప్పడం లేదని అందువల్ల తమను తెలంగాణలో కలుపుతూ నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.