: భద్రాచలం తెలంగాణ ప్రాంతానిదే: బలరాం నాయక్
భద్రాచలం తెలంగాణ ప్రాంతానిదేనని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అభిప్రాయపడ్డారు. తాను జీవోఎం ముందు భద్రాచలం చరిత్ర గురించి చెప్పానని, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని అన్నారు. అక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారని వారికి తెలుగు రాదని, కోయ భాష మాట్లాడుతారని చెప్పినట్టు తెలిపారు. అదీకాక రామదాసును నిజాం కారాగారంలో ఉంచారని, అందుకే భద్రాచలం తెలంగాణ ప్రాంతానికి చెందాలని తాను జీవోఎంకు వివరించినట్టు చెప్పారు. గోదావరి జిల్లాలకు భద్రాచలం 370 కిలోమీటర్ల దూరంలో ఉందని, అదీకాక 1923 నుంచే తెలంగాణలో ఉందని ఆయన అన్నారు.