: నటుడు రాజారవీంద్ర మద్యం ఫుల్ గా తాగారు: పోలీసులు
తాగి కారు నడుపుతూ శనివారం రాత్రి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడ్డ నటుడు రాజారవీంద్ర.. ఆ సమయంలో మద్యాన్ని అతిగా సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రివేళ తనిఖీలలో భాగంగా పోలీసులు స్కోడా కారులో వెళుతున్న రాజారవీంద్రను ఆపి బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా.. మద్యం సేవించినట్లు తేలింది. దీంతో ఆయన కారును స్వాధీనం చేసుకుని అదే రోజు రాత్రి కేసు నమోదు చేశారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసినప్పుడు రాజారవీంద్ర రక్తంలో ఆల్కహాల్ శాతం నాలుగింతలు అధికంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 100 ఎంఎల్ రక్తంలో ఆల్కహాల్ శాతం 30 మిల్లీగ్రాముల వరకు ఉండడానికి అనుమతి ఉంటుంది. పరీక్ష సమయంలో రాజారవీంద్ర రక్తంలో ఇది 113 ఎంజీగా ఉందని వెల్లడైంది.