: ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్ చేరుకున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఈ మధ్యహ్నం చివరిసారిగా జీవోఎం ముందు ఆయన వాదనలు వినిపించనున్నారు. సమైక్య రాష్ట్రం కోసం అధిష్ఠానాన్ని సైతం ధిక్కరించే ధోరణిలో ముందుకు వెళుతున్న కిరణ్... ఈ రోజు తన వైఖరిని బలంగా వినిపించబోతున్నారు.