: అవిశ్వాసంపై సరైన సమయంలో సరైన నిర్ణయం: టీడీపీ నేత మోత్కుపల్లి
కొన్ని పార్టీలకు లబ్ది చేకూరే ప్రమాదం ఉండడంతో, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టబోమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అవిశ్వాసంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
కైకలూరు నియోజకవర్గంలోని దాకరం వద్ద అధినేత చంద్రబాబుతో శాసనసభాపక్షం భేటీ అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు. ఒక్క నిందితుణ్నీ అరెస్టు చేయలేకపోయారని అన్నారు.
ఇక రానున్న బడ్జెట్ సమావేశాల్లో పంట రుణాల మాఫీ, చేనేత సమస్యలు, బాబ్లీ ప్రాజెక్టు, తాగునీటి ఎద్దడి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.