: పదిమందికి ఒకరుంటారట


ప్రతి పదిమందిలో ఒకరు షుగరు వ్యాధిగ్రస్తులు ఉంటారట... ఇప్పుడు కాదులెండి. 2035 నాటికి. ఇది వినడానికి బాధ కలిగించినా అధ్యయనాలు వెల్లడించిన విషయాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నవంబరు 14న వరల్డ్‌ డయాబెటిస్‌ డే సందర్భంగా ఇంటర్నేషనల్‌ డయాబెటిస్‌ ఫెడరేషన్‌ (ఐడిఎఫ్‌) డయాబెటిస్‌ అట్లాస్‌ను విడుదల చేసింది. ఇందులో ఈ విషయాలు వెల్లడించింది.

పెద్దవారిలో ముఖ్యంగా 20 నుండి 79 ఏళ్ల వయసున్న వారు భవిష్యత్తులో షుగరు వ్యాధి బారిన పడే అవకాశం ఉందని ఐడిఎఫ్‌ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది చివరికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 382 మంది మిలియన్ల ప్రజలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందట. నాలుగేళ్లకు ముందు 285 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడేవారని, ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోందని, ఇది 2035 నాటికి 592 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉందని ఈ రిపోర్టు హెచ్చరిస్తోంది. ఆర్ధికంగా తక్కువ, మధ్య ఆదాయం ఉన్న దేశాల్లో ఎక్కువమంది ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువమంది 40 నుండి 59 మధ్య వయసువారేనట.

  • Loading...

More Telugu News