: ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి అనుకునేలా చేస్తా: కేజ్రీవాల్


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత ఎన్నికలు చారిత్రక ప్రాధాన్యంగలవన్నారు. 15 ఏళ్ల అవినీతి పాలనను ప్రజలు అధికారానికి దూరంగా విసిరేయనున్నారని చెప్పారు. తమ ప్రచారం తాను ముఖ్యమంత్రిని కావడం కోసం కాదని, ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి అనుకునేలా చేయడం కోసమేనన్నారు. తల్లిదండ్రులు, మద్దతుదారులు వెంటరాగా ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ కు వెళ్లి కేజ్రీవాల్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News