: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్: కపిల్ సిబాల్


సెల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త! వచ్చే అక్టోబర్ నుంచి దేశంలో ఉచిత రోమింగ్ సౌకర్యం కల్పించే దిశగా యోచిస్తున్నామని కేంద్ర టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబాల్ వెల్లడించారు. ప్రస్తుతం ట్రాయ్ ఈ విషయంపై కసరత్తులు చేస్తోందన్నారు.

త్వరలోనే వారినుంచి సిఫార్సులు అందితే ఫ్రీ రోమింగ్ కు ఆమోదం తెలుపుతామని ఆయన తెలిపారు. దేశంలో తొలిసారిగా జాతీయ ఇంటర్ నెట్ రిజిస్ట్రీ (ఐఎన్ఆర్) విధానాన్ని ఈ రోజు ఢిల్లీలో సిబాల్ ఆరంభించారు. ఐఎన్ఆర్ సాయంతో ఐపీ చిరునామాల ప్రాసెసింగ్ ఖర్చు తేలికవుతుంది. 

  • Loading...

More Telugu News