: మాల్దీవుల్లో పరిస్థితులను గమనిస్తున్నాం: అమెరికా
మాల్దీవుల్లో పరిస్థితులను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించింది. మాల్దీవుల్లో అధికారం ప్రజామోదానికి తగినట్లుగా మార్పిడి జరగాలని అభిలషించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు ప్రకటన జారీ చేశారు. మాల్దీవుల అద్యక్షుడు మొహమ్మద్ వాహీద్ పదవీ కాలం ఈ నెల 11తో తీరిపోయింది. దీంతో ఎన్నికలకు ముందుగా పదవి నుంచి వాహిద్ వైదొలగనున్నారన్న వార్తలపై అమెరికా విదేశాంగ ప్రతినిధి స్పందించారు. మాల్దీవుల విషయంలో తమ వైఖరేమీ మారలేదన్నారు. అక్కడ జరగబోయే ఎన్నికలు, అధికార మార్పిడికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మరోవైపు మాల్దీవులలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది.