: వాయలార్ వ్యాఖ్యలపై రాద్ధాంతం చేయడమెందుకు?: కొండ్రు
అప్పడం, దోశెలతో తెలంగాణ వ్యవహారాన్ని పోల్చిన వాయలార్ రవి వ్యాఖ్యలపై తెలంగాణ వాదులు రాద్ధాంతం చేయడం సబబుకాదని మంత్రి కొండ్రు మురళి హితవు పలికారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ సాకారం చేసుకోవాలని వారికి మంత్రి సలహా ఇచ్చారు. ఇక, రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉందన్న కొండ్రు.. సమస్య పరిష్కరించేందుకు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.