: తెదేపా, వైకాపాలు అవాస్తవాలు చెబుతున్నాయి : కోదండరాం


జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు అనుసరించిన విధానాన్నే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కూడా పాటిస్తున్నారని టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగా లేదంటూ తెదేపా, వైకాపాలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని విమర్శించారు. గతంలో కన్నా భిన్నంగా ఏం జరుగుతుందో చెప్పాలని కోరారు. తెలంగాణ జేఏసీ ఈ రోజు హైదరాబాద్ లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. డిసెంబర్ మొదటి వారంలో మరోసారి ఢిల్లీ వెళ్లి... వివిధ పార్టీల నాయకులను కలసి పార్లమెంటులో బిల్లుకు సహకరించాలని కోరాలని ఐకాస నిర్ణయించింది.

  • Loading...

More Telugu News