: వృద్ధుడిని చంపి గుండె, నాలుక తినేశాడు
వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ గ్రామంలో గురువారం రాత్రి ఈ దారుణం సంభవించింది. 200 మంది ఉండే ఆ ఊర్లో 26 ఏళ్ల యువకుడు ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో నిద్రిస్తున్న 90 ఏళ్ల వృద్ధుడిని తలపై ఇనుప రాడ్ తో మోది చంపేశాడు. అనంతరం అతని గుండెను, నాలుకను శరీరం నుంచి వేరుచేసి తినేశాడు. తర్వాత వృద్ధుడితో పాటు ఆ ఇంటినే తగలబెట్టేశాడు. అక్కడకు కొంత దూరంలో నివాసముండే వృద్ధుడి కుమారుడు... ఇంటి నుంచి పొగలు వస్తుండటం చూశాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తన తలలో నుంచి ఏదో స్వరం వినిపించిందని... దాని ఆదేశాల ప్రకారమే ఇలా చేశానని 26 ఏళ్ల యువకుడు తెలిపాడు.