: విద్వేషాలకు వైఎస్సే బీజం వేశారు : కోడెల
ఇరు ప్రాంత సమస్యలను పరిష్కరించాకే విభజన చేయాలనేది తెదేపా వైఖరని ఆ పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ అన్నారు. తెలంగాణ అంశంపై తాము మొదట్నుంచీ స్పష్టమైన వైఖరితోనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ విషయంలో వైకాపా తన వైఖరిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉందని విమర్శించారు. నేటి ప్రాంతీయ విద్వేషాలకు 13 ఏళ్ల కిందటే వైఎస్ బీజం వేశారని తెలిపారు. ఆంటోనీ కమిటీ, జీవోఎం రాష్ట్రానికి రాకుండానే... ఇక్కడి సమస్యలను అధ్యయనం చేయకుండానే విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు.