: 495 పరుగులకు టీమిండియా ఆలౌట్


ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో 495 పరుగుల భారీ స్కోరు దగ్గర టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. పుజారా(113), రోహిత్ శర్మ(111), సచిన్(74), కోహ్లీ(57) చెలరేగడంతో టీమిండియా 495 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో, టీమిండియా 313 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ సాధించి విండీస్ కు తిరుగులేని లక్ష్యం నిర్దేశించింది. విండీస్ బౌలర్లలో ఫోర్డ్(5), డియోనరైన్(2) రాణించగా వారికి, బెస్ట్(1), గాబ్రియెల్(1)లు చక్కని సహకారమందిచారు.

ప్రస్తుత పరిస్థితుల్లో విండీస్ ఆటగాళ్లు పూర్తి సామర్థ్యం మేరకు ఆడితేనే మ్యాచ్ రసవత్తరంగా మారుతుంది. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండడంతో, విండీస్ అసాధారణ పోరాట పటిమ చూపుతుందా? అనేది చూడాల్సి ఉంది. సచిన్ కు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన టీమిండియా ఇప్పటికే సగం లక్ష్యాన్ని సాధించింది.

  • Loading...

More Telugu News