: పుజారా సెంచరీ.. కోహ్లీ అర్ధ సెంచరీ.. భారత్ 329/4


ముంబై టెస్టులో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్ మెన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఛటేశ్వర్ పుజారా సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది ఏడో అర్థ సెంచరీ. హాఫ్ సెంచరీ అనంతరం జోరు పెంచే క్రమంలో ముందుకు వచ్చి ఆడిన కోహ్లీ... బంతిని సరిగా అంచనా వేయలేక స్లిప్ లో స్యామీకి క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. తరువాత 150 బంతుల్లో పుజారా సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇతనికి రోహిత్ శర్మ(10) అండగా నిలిచాడు. దీంతో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News