: ఒబామా ప్రధాన వైద్యుడు భారతీయుడే


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి భారతీయతకు పట్టంకట్టారు. తన ప్రధాన వైద్యుడిగా భారతీయుడిని నియమించుకుని భారతీయులపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో కీలక పదవీ బాధ్యతలను ఒబామా భారతీయుల చేతుల్లో పెట్టిన విషయం తెలిసిందే. డాక్టర్స్ ఫర్ అమెరికా అనే సంస్థ సహ వ్యవస్థాపకుడైన డాక్టర్ వివేక్ హళ్లెగెరె మూర్తిని ఒబామా తన ప్రధాన వైద్యుడిగా నియమించారు. అసమాన ప్రతిభా పాటవాలు కలిగిన డాక్టర్ మూర్తి అమెరికన్లకు సమర్థవంతమైన సేవలు అందిస్తారన్న నమ్మకం తనకుందని ఈ సందర్భంగా ఒబామా అన్నారు. ఆయన ఈ కొత్త పాత్రలో చక్కగా ఒదిగిపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒబామా నిర్ణయాన్ని ఎన్నారై వైద్యులు స్వాగతించారు.

  • Loading...

More Telugu News