: ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖాధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాదు సమీపంలోని శంషాబాద్ మండలం సాతంరాయి వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించి 8 బస్సులను సీజ్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు బస్సులను సీజ్ చేశారు.