: తైవాన్ రాజధాని తైపీలో భూకంపం
తైవాన్ రాజధాని తైపీలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీంతో భయాందోళనలకు గురైన అక్కడి ప్రజలు భవనాల నుంచి భయంతో బయటకు పరుగులు తీస్తున్నారు. అయితే ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. భూకంప తీవత్ర రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. కాగా, తైవాన్ లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1999లో తైవాన్ లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి
2,300 మంది బలయ్యారు.