: సీమాంధ్ర టీచర్లకు శుభవార్త
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న టీచర్లకు శుభవార్త. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న రోజులను పని దినాలుగా పరిగణిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అప్పటి పని దినాలను పూర్తి చేస్తూ సీమాంధ్ర ఉపాధ్యాయులు సెలవు దినాల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ సిలబస్ పూర్తి చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బందికి 49 రోజుల వేతం చెల్లించేందుకు జీవో జారీ చేసింది.