: సీఎం పర్యటన వాయిదా వెనుక మనీష్ తివారి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 8 గంటలకు జీవోఎం హాజరుకావాలని నిన్న ఆదేశించిన కాంగ్రెస్ అథిష్ఠానం... ముఖ్యమంత్రి భేటీని ఈ నెల 18కి వాయిదా వేసినట్టు ఈ ఉదయం తెలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో పలు ఊహాగానాలు తలెత్తాయి. ముఖ్యమంత్రిని తొలగించి కొత్త ముఖ్యమంత్రిని నియమిస్తున్నారంటూ సీఎం వ్యతిరేక వర్గం ప్రచారం ప్రారంభించిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మనీష్ తివారీ కోరినట్టు తెలిపారని ప్రకటనలో పేర్కొంది. బాలల చలనచిత్రోత్సవంలో తనతో పాటు పాల్గొనాల్సిందిగా మనీష్ తివారి సీఎంను కోరారని... అందుకే ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడిందని తెలిపారు.