: బౌలర్లదే పై చేయి.. తోక ముడిచిన విండీస్ 162/8
టీమిండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ తోక ముడిచింది. ప్రణాళిక ప్రకారం ఆడిన భారత్ ఫలితం రాబట్టింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టన్ ధోని భారత జట్టు ఉద్దేశ్యమేంటో చెప్పకనే చెప్పాడు. దీంతో ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టులో గౌల్ ను అవుట్ చేసి షమి తొలి దెబ్బ కొట్టాడు. తరువాత అశ్విన్, ఓజాలు విజ్రుంభించి బౌలింగ్ చేసి తలో మూడు వికెట్లు తీయగా తొలి సెషన్ లో అంతగా ఆకట్టుకోని భువనేశ్వర్ కుమార్ రెండో సెషన్ లో ఓ వికెట్ తీశాడు.
దీంతో విండీస్ 49 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్ మన్ లలో గేల్(11), పావెల్(48), బ్రావో( 29), శామ్యూల్స్(19), చందరపాల్(25), నారాయన్(21) స్యామీ, షిల్లింగ్ ఫోర్డ్ లు డక్ అవుట్ కాగా క్రీజులో , రామ్ దిన్(1), బెస్ట్ లు ఉన్నారు. మ్యాచ్ వీక్షించేందుకు అభిమానులు, సెలబ్రిటీలు పోటెత్తారు.