: భార్య, అత్తలను హత్య చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్


తనను వేధిస్తున్నారంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన భార్య, అత్తలను రాయితో కొట్టి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధితో జరిగింది. బెంగళూరుకు చెందిన పద్మప్రియకు శర్వానంద్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే అంతకు ముందే పద్మప్రియకు తొలి వివాహం జరిగింది. ఈ విషయాన్ని పెళ్లి సమయంలో శర్వానంద్ కు చెప్పలేదు. కొన్ని నెలల అనంతరం విషయం తెలుసుకున్న అతను వారి నుంచి వేరుగా ఉంటున్నాడు. దీంతో పద్మప్రియ, ఆమె తల్లి పరమేశ్వరి శర్వానంద్ తో గొడవ పడుతుండేవారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. వారి వేధింపులతో విసిగిపోయిన శర్వానంద్ వారిని హత్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

  • Loading...

More Telugu News